List of National Symbols Of India In Telugu - educationtelugu

National symbols of india in telugu

NATIONAL SYMBOLS OF INDIA

National Symbols Of India : Helo  readers ఈ post లో భారతదే దేశానికి సంభందించిన జాతీయ చిహ్నాలకు సంభందించిన వివరాలు సమగ్రంగా అందించాము. మీరు ఏ competitive exam కి prepare అవుతున్న national symbols of india అనే topic నుంచి తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. కనుక ఈ post లో information మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

National Emblem Of India

  • భారతదేశ జాతీయ చిహ్నం – లయన్ క్యాపిటల్(ఒకే పీటపై 4 దిక్కులకు ముకములు ఉండి నిలబడి సింహాలు ఉంటాయి. 
  • ఈ ముద్రను సారనాధ్ లోని అశోకుని ధర్మస్థూపం నుంచి గ్రహించారు. 
  • ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి,కానీ 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. 
  • ఈ చిహ్న పీఠ మధ్యభాగంలో అశోకుని ధర్మ చక్రం ఉంటుంది. 
  • ధర్మ చక్రానికి ఇరువైపులా అనగా కుడివైపున వృషభం(ఎద్దు),ఎడమ వైపున అశ్వం(గుర్రం)ఉంటాయి. 
  • వృషభం స్థిరత్వానికి సంకేతం  మరియు అశ్వం వేగం/పౌరుషంకు సంకేతం. 
  • ఇవి రెండే కాక ఏనుగు,సింహం కూడా ఉంటాయి,అవి మనకు కనిపించవు. 
  • చిహ్న పీఠభాగముపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరిలిపిలో రాయబడి ఉంటుంది. 
  • ఈ వాక్యం ముండకోపనిషత్తు నుండి గ్రహించబడింది. 
  • దీనిని మన రాజ్యంగ సభ జాతీయ చిహ్నంగా జనవరి 26 1950 న ఆమోదించింది. 

National Flag Of India

  • మన జాతీయ పతాకం 3 రంగుల (కాషాయం,తెలుపు,ఆకుపచ్చ)తో కూడిన త్రివర్ణ పతాకం. 
  • ఈ పతాకం యొక్క పొడవు,వెడల్పుల నిష్పత్తి – 3:2 
  • దేశ సమగ్రతకు మరియు సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకంలో పైన కాషాయం మధ్యలో తెలుపు ,కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి,తెలుపు రంగు మధ్యభాగంలో ముదురు నీలం రంగు(నావి బ్లూ) తో అశోక చక్రం ఉంటుంది.ఇందులో 24 ఆకులు(spokes)ఉంటాయి. 
  • ఈ ధర్మ చక్రం ను అశోకుని సారనాధ్ స్తూపంలోని లయన్ క్యాపిటల్ నుంచి స్వీకరించారు. 

కాషాయం రంగు : ధైర్యానికి,త్యాగ నిరతికి,దేశభక్తికి చిహ్నం.
తెలుపు రంగు : శాంతికి ,సత్యానికి చిహ్నం. 
ఆకుపచ్చ : విశ్వాసం,పరాక్రమానికి,నమ్మకానికి చిహ్నం.
ధరచక్రం : భారత దేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. 
చక్రం లోని 24 ఆకులు : 24 గంటలకు,ధర్మానికి,న్యాయానికి,క్రమ శిక్షణకు సంకేతం. 

త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా 1947, జూలై 22 ఆమోదించినది. 
మన జాతీయ జెండాను అధికారకంగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రదర్శించారు. 
దీనిని తొలిసారి పార్లమెంటు పై ఎగురవేశారు. 
ఈ పతాక నమూనాను ఆంధ్రప్రదేశ కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. 

జెండా పూర్వ పరాలు:

తొలి సారిగా 1921 లో విజయవాడ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాను ప్రదర్శించారు.
తెల్లపట్టి మధ్యలో చరఖా ఉండేది. తర్వాత దీని స్థానంలో సారనాధ్ స్థూపంలోని అశోక చక్రంను రూపొందిచారు.

National Anthem  Of India 

మన జాతీయ గీతం: జనగణమన 
రవీంద్రనాధ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన పూర్తి గీతంలో 5 చరణాలున్నాయి,తొలి చరణంలోని 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. 
ఈ గీతాన్ని మొదటి సారిగా 1991, డిసెంబర్ 27 వ తేదీన కలకత్తా లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. 
1912 జనవరిలో "భారత విధాత "పేరుతో ఈ గీతం తొలిసారిగా "తత్వబోధిని" పత్రికలో ప్రచురించారు.
ఈ గీతాన్ని ఠాగూర్ మదనపల్లిలోని bt కాలేజీలో "మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా "అనే పేరుతో 1919 లో ఆంగ్లంలోకి అనువదించారు. 
జాతీయగీతం 1950 జనవరి 24 నుంచి అధికారికంగా వాడుకలోనికి వచ్చింది. 
పూర్తి జాతీయ గీతాన్ని పడడానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకన్లు , సంక్షిప్తంగా పాడడానికి తీసుకోవాల్సిన సమయం 20 సెకన్లు.
ఠాగూర్ రాసిన అమర్ సోనార్ బంగ్లా (నా స్వర్ణ బంగ్లా)గీతమే 1972 లో బంగ్లాదేశ్ ఏర్పడినపుడు ఆ దేశానికి జాతీయ గీతం అయింది. 

National Song Of India 

మన జాతీయ గేయం : వందేమాతరం. 
బంకించంద్ర చటర్జీ రాసిన "ఆనంద్ మఠ్" నవలలోని వందేమాతరం మన జాతీయ గేయం. 
1882 లో ఈ నవల ప్రచురించబడింది. 
వందేమాతర గేయాన్ని తొలుత బంకించంద్ర చటర్జీ తొలుత సంస్కృతంలో రాశారు. అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు.
ఈ గేయాన్ని తొలిసారిగా 1896 కలకత్తా సమావేశంలో పాడారు.
వందేమాతర గేయాన్ని జనవరి 24,1950 న రాజ్యాంగ సభ జాతీయ గేయంగా అమోదించబడింది.

National Animal Of India 

మన జాతీయ జంతువు : పెద్ద పులి (రాయల్ బెంగాల్ టైగర్).
శాస్త్రీయ నామం: పాంథారా టైగ్రిస్(లిన్నేయస్).
1972 వరకు సింహం జాతీయ జంతువు ఆ తర్వాత పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించారు. 
పులి అనేది  శక్తికి , ధైర్యానికి ప్రతీక. 
 1973 నుంచి మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు. 

National Bird Of India 

మన జాతీయ పక్షి నెమలి. 
శాస్త్రీయ నామం: పావోక్రిస్టేటస్.
జాతీయ పక్షిగా నెమలిని మన భారత భారత ప్రభుత్వం 1946 లో గుర్తించింది. 

National Aquatic Animal 

మన జాతీయ జలచరం : డాల్ఫిన్. 
శాస్త్రీయ నామం :ప్లాటనిష్టా గాంగెటిక.
కేంద్ర ప్రభుత్వం జాతీయ జలచరంగా 2009 అక్టోబర్ 5 న ప్రకటించినది. 
డాల్ఫిన్ ను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యుల్ -1లో చేర్చారు.

National Tree of India 

మన జాతీయ వృక్షం: మఱ్ఱి చెట్టు. 
శాస్త్రీయ నామం:ఫైకస్ బెంగాలెన్సేస్. 

National Flower Of India 

మన జాతీయ పుష్పం : తామర పువ్వు. 
శాస్త్రీయ నామం : నెలుంబో న్యుసిఫెరా.  
ఇది మన దేశ నాగరికత , సంస్కృతికి చిహ్నం. 

National Fruit Of India 

మన జాతీయ ఫలం: మామిడి. 
శాస్త్రీయ నామం : మ్యంజి ఫేరా ఇండికా. 
ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా(పండ్ల రారాజు) అంటారు.

National Heritage Animal Of India 

మన వారసత్వ జాతీయ జంతువు : ఏనుగు. 
శాస్త్రీయ నామం:elephas maximus. 
2010 వ సంవత్సరంలో వారసత్వ జంతువుగా ప్రకటించారు.
1992 లో ఏనుగుల సంతతిని పెంచడానికి project elephant పధకాన్ని ప్రవేశపెట్టారు. 

National Calender Of India 

జాతీయ కాలెండర్ ని  గ్రేగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుంచి తయారుచేశారు. 
ఈ క్యాలెండర్ ను శక సంవత్సరం (1879)ఆధారంగా చైత్రం తొలి మాసం ఫాల్గుణం చివారిమాసం ఆధారంగా రూపొందించారు. 
శక సంవత్సరం క్రీ. శ 78 న ప్రారంభమైనది. 
శక సంవత్సరం లో 365 రోజులు ఉంటాయి.
సాధారణ శక సంవత్సరం మార్చి 22 తో ప్రారంభమవుతుంది.
లీపు సంవత్సరంలో మార్చి 21 తో ప్రారంభమవుతుంది. 

National Time Zone Of India 

జాతీయ కాలమానం: 

82 ½ 0 తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలాన్ని నిర్ణయిస్తారు.
గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గం|| ముందు ఉంటుంది. 

National Game Of India  

మనదేశ జాతీయ క్రీడ - హాకీ. 
1928 – 1956 మధ్యకాలన్నీ హాకీ చరిత్రలో భారత్ కు  స్వర్ణ యుగంగా పరిగణించవచ్చు.

National River Of India 

మన జాతీయ నది : గంగా నది. 
జాతీయ నదిగా గంగ నదిని 2008 , నవంబర్ 4 వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

National Currency Of India

National Currency  – రూపాయి
భారత ప్రభుత్వం రూపాయి చిహ్నాన్ని 2010,జులై 15 న ప్రపంచానికి పరిచయం చేసింది. 
National symbols off  india అనే  topic కనుక మీకు ఉపయోగ కరంగా ఉంటే comment చేయండి,మీ మిత్రులకు share చేయండి. 

Previous
Next Post »