Scientific Instruments And Their Uses List - General Knowledge - educationtelugu

Scientific Instruments And Their Uses

Scientific Instruments And Their Uses

 Helo readers  General knowledge కి సంభందించిన ముఖ్యమైన అంశాలలో  Scientific  Instruments and their uses(సైంటిఫిక్ పరికరాలు వాటి ఉపయోగాలు) అనే Topic నుంచి పోటీపరీక్షలలో తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందువలన ఈ topic గురించి  ఈ పోస్ట్ లోసమగ్ర సమాచారం అందించాము.

List Of Scientific Instruments And Its Uses


సైంటిఫిక్ పరికరం  ఉపయోగం 
అల్టీ మీటరు -వాతావరణంలో ఎత్తును కొలుచుటకు 
ఎనిమో మీటరు -గాలి వేగాన్ని కొలుచుటకు 
ఆడియో మీటరు-శబ్ధ తీవ్రతను కనుగొనడానికి 
బారో మీటరు -వాతావరణ పీడనంను కనుగొనడానికి 
ఎలక్ట్రో ఎన్ సెఫలో గ్రాఫ్  -మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరం 
పాథో మీటరు -సముద్రాల లోతును కనుగొనుటకు 
హైడ్రో మీటరు -ద్రవాల విశిష్ట సాంద్రతను కనుగొనుటకు 
హైగ్రో మీటరు -గాలిలో తేమ శాతం కనుగొనుటకు 
మానో మీటరు -వాయువుల పీడనాన్ని కొలుచుటకు 
పైరో మీటరు -సూర్యుని ఉష్ణోగ్రత మొదలైన అధిక ఉష్ణోగ్రతలు కొలుచుటకు 
రాడార్ -రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను కనుగొనే పరికరం 
రెయిన్ గేజ్ -ఒక ప్రదేశం లోని వర్షపాతం కొలుచుటకు 
రేడియో మీటరు -అణుధార్మికతను కొలుచుటకు 
శకారీ మీటరు -ఒక ద్రావణంలో పంచదార శాతాన్ని కొలుచుటకు 
 సెక్ట్సంట్-సూర్యుడు మొదలైన సుదూర పదార్దాల ఎత్తుని కొలుచుటకు 
స్పిగ్నో మానో మీటరు -రక్తపోటు (blood pressure)ను కనుగొనటానికి 
సిస్మోగ్రాఫ్ -భూకంప తీవ్రతను కొలుచుటకు 
అమ్మీటర్ -విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనం 
ఎస్కలేటర్ -మనుషులను కిందికి లేదా పైకి చేర్చే మెట్లు 
ఓడో మీటరు -మోటారు వాహనాల వేగాన్ని కొలిచే సాధనం 
క్రెస్కో గ్రాఫ్ -మొక్కల పెరుగుదలను కనుగొనే సాధనం 
క్రోనో మీటరు -సముద్రంలో నౌక  ఏ రేఖాంశం మీద ఉన్నదో తెలిపే సాధనం 
టెలీ మీటరు -దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేసే సాధనం 
ప్లానీ మీటర్-సమతల ఉపరితలం యొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం
మాగ్నటో మీటరు -అయస్కాంత భ్రామకాలను,క్షేత్రాలను పోల్చే సాధనం 
రిఫ్రాక్టో మీటరు -ఒక పదార్ద వక్రీభవన గుణకంను కొలవడానికి ఉపయోగించే పరికరం 
సాలినో మీటరు -ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం 
స్పెక్ట్రో మీటరు -వక్రీభవన గుణకాలను కొలిచే సాధనం 
స్ట్రాబో స్కోప్ -వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూడడానికి ఉపయోగించే సాధనం  
హైడ్రో ఫోన్ -జల ఉపరితలం కింద శబ్ధ వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే సాధనం 
సిక్స్ ధర్మామీటర్ -అత్యల్ప,అత్యధిక ఉష్ణోగ్రతలను కొలిచే సాధనం
డైనమో -యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం
క్రయో మీటరు -అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే సాధనం
ఎండో స్కోప్ -శరీరంలో అంతర్గత భాగాలను పరీక్షించే పరికరం 
గాల్వనో మీటరు -స్వల్ప విద్యుత్ ప్రవహాన్ని గుర్తించే పరికరం 
బాంబు కేలోరీ మీటరు -పదార్ధపు కేలోరీఫిక్ విలువలు కనుగొనేది
ఓల్ట్ మీటరు -పొటెన్షియల్ తేడాను కొలిచేది 
మైక్రో మీటరు-మిక్కిలి చిన్నవైన దూరాలను కొలిచే సాధనం 
లాక్టో మీటరు-పాల స్వచ్చతను కొలిచే పరికరం 
బైనా క్యులర్ -దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూపే సాధనం 
ఆక్టినో మీటరు-వికిరణ శక్తి తీవ్రతను కొలిచే సాధనం 
కార్డియో గ్రామ్ -గుండె స్పందనను రేఖాయుతంగా నమోదు చేసే పరికరం 
కెలోరీ మీటరు-ఉష్ణమును కొలుచు సాధనం 
ఎక్యుములేటర్ -విద్యుత్ ను నిల్వ ఉంచు బ్యాటరీ 
ఎయిరో మీటరు-గాలి,ఇతర వాయువుల సాంద్రత,భారం కొలుచుటకు 
డెసీ మీటరు-వాయు సాంద్రత కొలుచుటకు 
పాటో మీటరు -కాంతి జనకాల తీవ్రత పోల్చుటకు 
హైడ్రో స్కోప్ -నీటి అడుగు వస్తువులు చూచుటకు సాధనం 
కిమో గ్రాఫ్ -పీడన వృత్యాసాలు గుర్తించుటకు 
టెల్ స్టార్ -ఖండాల మధ్య ప్రసారమయ్యే వైర్ లెస్ ,టెలివిజన్ సంకేతాలు తెల్సుకొనుటకు
థెర్మోస్ట్రాట్ -స్థిరమైన ఉష్ణోగ్రత నెలకొల్పు సాధనం 
స్వర్ణ పత్ర విద్యుద్ధర్శిని -విద్యుత్ ఆవేశం కొల్చు సాధనం 
క్వాడ్రెంట్ -ఖగోళ ఎత్తులు,కోణాలు కొల్చు సాధనం 
భ్యూ పోర్ట్ స్కేల్ -పవన శక్తీ అంచనా వేయుటకు 
SONAAR-నీటిలో మునిగి పోయిన వస్తువులను గుర్తించుటకు 
 


Previous
Next Post »